
హైదరాబాద్: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల చేశారు. తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా టెట్ ఫలితాలను విడుదల చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య టెట్ ఆన్‌లైన్ పరీక్షలు జరిగాయి. టెట్ ఫలితాల్లో 33.98 శాతం ఉత్తీర్ణత సాధించారు. 90 వేల 205 మంది అభ్యర్థులు టెట్ పరీక్ష రాయగా.. 30 వేల 649 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను https://schooledu.telangana.gov.in లేదా https://tgtet.aptonline.in ద్వారా చెక్ చేసుకోవచ్చు.
టీజీ టెట్ పరీక్షలు జూన్ 18 నుంచి 30 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు టెట్ పేపర్–1కు మొత్తంగా63,261 మందికి గానూ 47,224 (74.65%), పేపర్– 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ లో 66,686 మందికి 48,998 మంది (73.48%), సోషల్ స్టడీస్లో 53,706 మందికి గానూ 41,207 మంది (76.73%) హాజరయ్యారు.