కొత్త మున్సిపాలిటీల్లో క్యాడర్ స్ట్రెంత్‌‌‌‌‌‌‌‌ శాంక్షన్‌‌‌‌‌‌‌‌ చేయండి

కొత్త మున్సిపాలిటీల్లో  క్యాడర్ స్ట్రెంత్‌‌‌‌‌‌‌‌ శాంక్షన్‌‌‌‌‌‌‌‌ చేయండి


హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో క్యాడర్ స్ట్రెంత్ శాంక్షన్ చేయాలని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీ స్ సెంట్రల్‌‌‌‌‌‌‌‌ ఫోరం(టీఎంఈసీఎఫ్) కన్వీనర్ ప్రభాక ర్, కో కన్వీనర్ పర్వతాలు డిమాండ్ చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో ఖాళీలు భర్తీ చేయడంతో పాటు కొత్త మున్సిపాలిటీలకు కమిషనర్ పోస్టులు 84 శాంక్షన్ చేయాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని నాంపల్లి టీఎన్జీవో భవన్‌‌‌‌‌‌‌‌లో జరిగిన టీఎంఈసీఎఫ్ సమావేశానికి రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ నుంచి మేనేజర్ల పోస్టుల వరకు ప్రమోషన్లు ఇవ్వాలని ఫోరం నేతలు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 317 జీవోతో బదిలీ అయిన వారిని పాత జోన్లకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు ఏండ్ల నుంచి పనిచేస్తున్న బిల్ కలెక్టర్లను వార్డు ఆఫీసర్లుగా నియమించాలన్నారు. ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు చీఫ్ గెస్ట్‌‌‌‌‌‌‌‌లుగా టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ హాజరై, మాట్లాడారు. మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను ఆ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.