ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ : ఇతర రాష్ట్రాల మహిళల సంగతి ఏంటీ..!

ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ : ఇతర రాష్ట్రాల మహిళల సంగతి ఏంటీ..!

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. ఆదిలాబాద్ నుంచి ఏపీ సరిహద్దుల వరకు ఉచితంగా వెళ్లొచ్చు.. టికెట్ కొనాల్సిన పని లేదు.. ఈ విషయంలో ఉన్న సందేహాలకు సమాధానం ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరికీ ఉచితం కాదని.. తెలంగాణ మహిళలకు మాత్రమే ఫ్రీ అని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో వారి చిరునామా ఉండాలని.. ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డుల్లో తెలంగాణ రాష్ట్రం అడ్రస్ ఉండాలని.. అలా అయితేనే ఉచిత ప్రయాణం వర్తిస్తుందని ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలో జీవిస్తున్నంత మాత్రాన ఉచిత ప్రయాణానికి అర్హులు కారని.. ఆధార్ అడ్రస్ తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఉండాలని ప్రకటించారు. ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు ఉన్నట్లయితే ఈ గృహలక్ష్మి పథకానికి మహిళలు అర్హత సాధిస్తారని వెల్లడించారు సజ్జనార్.

మొదటి వారం రోజులు ఏ మహిళా అయినా గుర్తింపు కార్డు లేకుండా ప్రయాణించొచ్చు అని.. ఆ తర్వాత ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూనే.. త్వరలోనే అర్హులైన మహిళలకు గృహ లక్ష్మి కార్డు జారీ చేయటం జరుగుతుందని వెల్లడించారు. గృహ లక్ష్మి కార్డు జారీ తర్వాత.. ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేదని వివరించారు.