TS​ బదులుగాTG ..ప్రభుత్వ విభాగాలన్నీTGగానే ప్రస్తావించాలి

TS​ బదులుగాTG ..ప్రభుత్వ విభాగాలన్నీTGగానే ప్రస్తావించాలి
  • జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌‌లలో అట్లనే రాయాలి
  • ‘టీజీ’ కోడ్​తోనే వెహికల్స్​రిజిస్ట్రేషన్లు 
  • రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

హైదరాబాద్​, వెలుగు :  ప్రభుత్వ విభాగాలతోపాటు అన్నిచోట్లా ఇక నుంచి తెలంగాణను సంక్షిప్తంగా ‘టీఎస్’​కు బదులుగా ‘టీజీ’గానే ప్రస్తావించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నది. వెహికల్స్​ రిజిస్ట్రేషన్లు టీజీ కోడ్​తోనే చేయాలని ఆదేశాలు జారీచేసింది.  వాహనాల రిజిస్ట్రేషన్లలో తెలంగాణ సంక్షిప్త పదాన్ని ‘టీజీ’గా పేర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అధికారిక సమాచారాల్లో అంతటా ‘టీజీ’గా ప్రస్తావించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్​) శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌లలో ‘టీజీ’గానే పేర్కొనాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అధికారిక సమాచారాల్లో ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ విభాగాలన్నీ ‘టీజీ’గా ప్రస్తావించాలని, దీనిని వెంటనే అమలు చేయాలని ఆదేశించారు.

టీఎస్​ స్థానంలో టీజీగా మార్చాలి

గవర్నమెంట్​ఆఫీసుల బోర్డులు, వెబ్​సైట్లు, ఆన్​లైన్​ ప్లాట్​ ఫామ్​లలోనూ ‘టీజీ’ ఉండాలని ఉత్తర్వుల్లో సర్కారు పేర్కొన్నది. ‘టీఎస్’​ అని గతంలో ప్రింట్​ చేసిన స్టేషనరీ, ప్రింటింగ్​ మెటీరియల్​ను సైతం తొలగించాలని, వాటి స్థానంలో ‘టీజీ’తో కొత్తగా ముద్రిం చాలని స్పష్టం చేసింది. ఈ నెల 31నాటికి జనరల్​అడ్మినిస్ట్రేషన్ శాఖకు నివేదిక ఇవ్వా లని అన్ని శాఖల సెక్రటరీలను సీఎస్​ ఆదేశిం చారు. తెలంగాణ ఉద్యమకాలంలో ప్రజలు  తెలంగాణను సంక్షిప్తంగా ‘టీజీ’ అని ఉపయోగించారు. తమ వెహికల్స్​పై నాడు ఏపీకి బదులు ‘టీజీ’ అని రాసుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభు త్వం తెలంగాణను సంక్షిప్తంగా ‘టీఎస్‌’గా మార్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా  ఇప్పుడు ‘టీజీ’గా మార్చాలని నిర్ణయం తీసుకున్నది.