- నేటి నుంచి 31 వరకు ప్రదర్శన
న్యూఢిల్లీ, వెలుగు: ఎర్రకోట వేదికగా ‘భారత్ పర్వ్’ వేడుకల్లో భాగంగా తెలంగాణ టూరిజం స్టాల్‌ను మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవ న్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయెల్ ప్రారం భించారు. భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని, పర్యాటకాన్ని, ‘ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తితో జనవరి 26–31వరకు కేంద్రం ఈ వేడుకల్ని నిర్వహస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం తన సాంస్కృ తిక వారసత్వాన్ని ప్రదర్శిస్తున్నది.
ఇందులో తెలంగా ణకు చెందిన ప్రముఖ పేరిణి, ఒగ్గుడోలు నృత్యాలు, చేర్యాల్, నిర్మల్ పెయింటింగ్స్, వెండి ఫిలిగ్రీ, జోగు ళాంబ గద్వాల, పోచంపల్లి చీరలు, హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవను న్నాయి. అలాగే.. చారిత్రక కట్టడాలు (రామప్ప దేవా లయం, గోల్కొండ కోట), ఆధ్యాత్మిక కేంద్రాలు, కొత్త గా అభివృద్ధి చెందుతున్న ఎకో–టూరిజం ప్రాంతాల గురించి వివరించే ప్రత్యేక పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, తెలంగాణకు చెందిన విశిష్ట మైన పిండివంటలను సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు.
