
ట్రాఫిక్ రూల్స్ పాటించండి, హెల్మెట్లు ధరించండి, రోడ్డు ప్రమాదాలు నివారించండంటూ ఒక వైపు రవాణా మరియు పోలీస్ శాఖలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మైనర్ల బైక్ జోరు మాత్రం ఆగడం లేదు. 30వ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఆర్భాటంగా నిర్వహిస్తుండగానే కుర్రకారు రూల్స్ కు విరుద్ధంగా బైక్ వెళ్తుండగా శుక్రవారం సిద్దిపేటలో ‘వెలుగు’ క్లిక్ మనిపించింది.