- వెహికల్ రిజిస్ట్రేషన్ ఏడాది పాటు రద్దు: రవాణా శాఖ
హైదరాబాద్, వెలుగు: మైనర్లు వాహనం నడిపి పట్టుబడితే వారికి 25 ఏండ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేది లేదని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ విషయంలో రవాణా శాఖ చట్టాలను కఠినంగా అమలు చేస్తామని సంబంధిత అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, మైనర్లు నడిపిన వాహన రిజిస్ట్రేషన్ ను ఏడాది పాటు రద్దు చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ఏడాది ఇలా మొత్తం 4,070 వాహనాలను పట్టుకున్నామని, వాటి రిజిస్ట్రేషన్ లను ఏడాది పాటు రద్దు చేసినట్టు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని, అందుకే మైనర్లు వాహనాలు నడపొద్దని, వారికి యజమానులు వెహికల్స్ ఇవ్వొద్దని హెచ్చరించారు.
