వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ముషీరాబాద్, వెలుగు: వడ్డెరలను బీసీ జాబితా నుంచి తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని, ప్రత్యేక కార్పొరేషన్​ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం చైర్మన్ శివరాత్రి అయిలమల్లు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ఆదివారం తెలంగాణ వడ్డెర సంఘం, చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు పిట్ల మల్లేశం అధ్యక్షతన బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం 8వ వార్షికోత్సవం నిర్వహించారు.

 అయిలమల్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ పనుల్లో 25 శాతం వడ్డెర కాంట్రాక్టర్లకు కేటాయించాలని, కార్మికులు ప్రమాదవశాస్తూ మరణిస్తే రూ.20 లక్షలు, గాయపడితే రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని కోరారు. ఉప్పల్ భగాయత్ లో వడ్డెరలకు కేటాయించిన భూమిలో ఆత్మగౌరవ భవనం నిర్మించాలని, నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల శ్రీనివాస్, శివరాత్రి మల్లేశ్, మహిళా అధ్యక్షురాలు శివరాత్రి ఉమ   పాల్గొన్నారు.