అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్ల రేషనలైజేషన్ ?

అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్ల రేషనలైజేషన్ ?
  • 317 జీవో ప్రకారం జోనల్ కేటాయింపులు

 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలో పనిచేస్తున్న డాక్టర్లకు 317 జీవో ప్రకారం జోనల్ కేటాయింపులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మల్టీజోనల్ కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోకి వచ్చే సివిల్ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న డాక్టర్ల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని అన్ని హాస్పిటళ్ల సూపరింటెండెంట్లకు వీవీపీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అజయ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

జోనల్ అలకేషన్ తర్వాత పేషెంట్‌‌‌‌‌‌‌‌ లోడుకు తగ్గట్టు అన్ని ఆస్పత్రుల్లో డాక్టర్ల రేషనలైజేషన్ చేపట్టే అవకాశం ఉంది. డాక్టర్ల తర్వాత నర్సింగ్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌కు కూడా జోనల్ కేటాయింపులు చేపడతామని అజయ్‌‌‌‌‌‌‌‌ కుమార్ తెలిపారు. అయితే తమతో పాటే నర్సింగ్‌‌‌‌‌‌‌‌, ఇతర స్టాఫ్‌‌‌‌‌‌‌‌కు అందరికీ ఒకేసారి జోనల్ కేటాయింపులు చేపట్టాలని డాక్టర్లు కోరుతున్నారు.