
రాష్ట్రంలో రాగల 3 రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ రాష్ట్రంలో అక్కడక్కడ గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు క్రింది స్థాయి గాలులు పశ్చిమ,వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 3 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఇక ఈరోజు,రేపు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షంలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.