హైదరాబాద్: ఢిల్లీలోని ‘ది జిమ్నాస్టిక్ అకాడమీ’ వేదికగా జరిగిన లెవల్ వైజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ జిమ్నాస్టిక్స్ పోటీల్లో తెలంగాణ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచింది. టేబుల్ వాల్ట్, అన్‌ఈవెన్ బార్స్, బ్యాలెన్సింగ్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ వంటి విభాగాల్లో సత్తా చాటిన తెలంగాణ క్రీడాకారులు 25 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. ఈ అద్భుత ప్రదర్శనతో జాతీయ స్థాయిలో ఓవరాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
హియా యాదవ్, అంశుల్ యాదవ్, మాన్వి రెడ్డి, లౌక్య విరాట్, ఇనార రుక్మిణి, సిమోన్ పెస్టోంజీ, ఖుషీ రాయ్‌తో పాటు పలువురు క్రీడాకారులు వివిధ లెవల్స్‌లో రాణించి రాష్ట్ర కీర్తిని చాటారు. ఈ విజయం సాధించిన క్రీడాకారులను అంతర్జాతీయ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి, నేషనల్ జడ్జి ఎ. ప్రియాంక అభినందించింది. బుధవారం హైదరాబాద్‌లోని కల్పతరు బై వందన బద్రుక ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె విజేతలతో కలిసి పాల్గొన్నది.
