ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళకు కీలక పదవి

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళకు కీలక పదవి

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ కు చెందిన మహిళ కర్రి సంధ్యారెడ్డి సత్తాచాటారు. సిడ్నీ నగరంలోని స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపాలిటీకి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. 2021 జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు.  లేటెస్ట్ గా సంధ్యకు డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ సంతతి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన ఆమె స్థానిక స్టాన్లీ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. సంధ్యారెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో లా పట్టా అందుకున్నారు. ఉస్మానియాలో ఎంఏ చేశారు. ఆమె తల్లిదండ్రులు పాథోళ్ల శంకర్ రెడ్డి, సారా రెడ్డి. 1991లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన కర్రి బుచ్చిరెడ్డిని పెళ్లి చేసుకుని భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లింది.1991 నుంచి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.  అక్కడి ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ నుంచి మైగ్రేషన్ లా పట్టా పొందారు. ఆ తర్వాత ఇమ్మిగ్రేషన్ అటార్నీగా పని చేసింది.

 స్థానికంగా ఉంటూ భర్తతో కలిసి విస్తృత సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె చొరవతో స్ట్రాత్‌ఫీల్డ్‌లోని హోమ్‌బుష్ కమ్యూనిటీ సెంటర్‌లో భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆమె సేవలకు గుర్తింపుగా ఆమెకు 2020లో సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. 2021లో, ఆమె నివసించే స్ట్రాత్‌ఫీల్డ్ మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికలను నిర్వహించింది. స్థానిక ప్రవాస భారతీయులతో పాటు ఆస్ట్రేలియన్లు కూడా ఆమెను పోటీ చేయాలని కోరారు. స్థానిక లేబర్, లిబరల్ పార్టీల అభ్యర్థులపై ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

ఈ మున్సిపాలిటీకి ఏటా మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డిప్యూటీ మేయర్‌గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ అవకాశం రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆమెకు నీల్, నిఖిల్ రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో నిఖిల్ రెడ్డి ఈ ఏడాది ఆస్ట్రేలియా జాతీయ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు