న్యూఢిల్లీ, వెలుగు: రాజస్థాన్ వేదికగా జరిగిన మిసెస్ ఇండియా – 2023 పోటీల్లో మన రాష్ట్రానికి చెందిన మహిళ విన్నర్ గా నిలిచారు. క్లాసికల్ కేటగిరి (40–60 వయసు) లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ శ్రీవర్షిణి సార్వభౌమ గెలుపొందారు. రాజస్థాన్ లోని రణతంబోర్లో జరుగుతున్న ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. ఫైనల్లో విజేతగా నిలిచిన శ్రీవర్షిణి 2023లో అంతర్జాతీయ వేదికపై జరిగే అందాల పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.హైదరాబాద్ జూబ్లీహిల్స్ కు చెందిన శ్రీవర్షిణి ప్రస్తుతం యూకేలోని బ్లాక్ పుల్ టౌన్లో డాక్టర్‌గా పనిచేస్తున్నారు.
