హైదరాబాద్ : వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ ను అమలు చేయవద్దని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫెడరేషన్ ప్రధాన కార్యద ర్శిబి.బసవపున్నయ్య నేతృత్వంలో యూనియన్ నాయకులు కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని ఆయన నివాసంలో కలిసి ఒక వినతిపత్రం అందజే శారు.
లేబర్ కోడ్ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని కోరారు. జర్నలిస్ట్ యాక్సిడెంట్ పాలసీని పునరుద్ధరిం చాలని, త్రైపాక్షిక కమిటీ నియమించాలని, కమిటీలో హెచ్ యూజెకి ప్రాతినిధ్యం ఇవ్వా లని, కనీస వేతనాల జీవో సవరించాలని, రాత్రి వేళ మహిళా జర్నలిస్టులకు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. తమ శాఖ పరిధిలోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
