- రైతుల ఖాతాల్లోకి రూ.1,129 కోట్లు జమ
- వెల్లడించిన సివిల్ సప్లయ్స్ శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 12.38 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు సన్న రకం 5.07 లక్షల టన్నులు, దొడ్డు రకం 7.31 లక్షల టన్నులు సేకరించామని చెప్పారు.
ఇప్పటికే 1.54 లక్షల మందికిపైగా రైతులకు సంబంధించి రూ.1,129.43 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసినట్టు కమిషనర్ పేర్కొన్నారు. ప్రధానంగా నిజామాబాద్, నల్గొండ, కామారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్, జగిత్యాల, మెదక్, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో కొనుగోలు కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
