- వరంగల్ డీసీసీ కార్యదర్శిగా ట్రాన్స్ జెండర్ స్నేహ
గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ప్రతినిధి ఓరుగంటి స్నేహ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ అధ్యక్షురాలు ఓరుగంటి లైలా, సలహాదారు ఈ.వి.శ్రీనివాస్ రావు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక న్యాయానికి నిదర్శనమన్నారు.
