
వైరా,వెలుగు : ఖమ్మం జిల్లా వూరా మండలం గరికపాడు గ్రామానికి చెందిన శీలం హర్షవర్ధన్ రెడ్డి (27) దక్షిణాఫ్రికాలో బుధవారం అనారోగ్యంతో చనిపోయాడు. శీలం వెంకట రామిరెడ్డి, కృష్ణ కుమారి కొడుకైన హర్షవర్ధన్ రెడ్డి దక్షిణ ఆఫ్రికాలోని మలావిలో ఉద్యోగం చేస్తున్నారు. 20 రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న అతను పదిరోజుల నుంచి అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.