పోలాండ్లో తెలంగాణ యువకుడు మృతి

పోలాండ్లో తెలంగాణ యువకుడు మృతి

మల్యాల, వెలుగు: పోలాండ్ లో జరిగిన యాక్సిడెంట్ లో  తెలంగాణకు చెందిన యువకుడు చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. మల్యాల మండల కేంద్రానికి చెందిన పొన్నం మనోజ్ గౌడ్(29), ఉపాధి కోసం రెండున్నరేండ్ల కింద పోలాండ్ దేశానికి వెళ్లాడు.

అక్కడే పిస్కీ గ్రామంలో ఉంటున్నాడు. సోమవారం ఉదయం రోడ్డు పక్కన ఫుట్ పాత్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి స్పీడ్ గా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన మనోజ్‌ స్పాట్‌లో చనిపోయాడు. కాగా అతడు 5 నెలల కింద ఇంటికి వచ్చి వెళ్లాడు. మనోజ్ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.