విద్యుత్ రంగంలో తెలంగాణ అప్పులు రూ, 81 వేల 516 కోట్లు

విద్యుత్ రంగంలో తెలంగాణ అప్పులు రూ,  81 వేల 516 కోట్లు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  విద్యుత్ అంశంపై అసెంబ్లీలో స్పల్పకాలిక చర్చ నడుస్తుంది.  డిప్యూటీ సీఎం, అర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని  రిలీజ్ చేశారు.  అనంతరం భట్టి మాట్లాడుతూ..  రాష్ట్ర మనుగడకు విద్యుత్  రంగం ఎంతో ముఖ్యం.  రాష్ట్రంలో విద్యుత్ రంగం అందోళనకరంగా ఉంది. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక గత బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది.

.2023 నాటికి విద్యుత్ రంగం అప్పులు రూ.  81 వేల 516 కోట్లు..  డిస్కంలు అప్పుల ఊబిలో  కూరుకుపోయాయి.  డిస్కంలకు రూ.  28 వేల 673 కోట్ల బకాయిలున్నాయి. ఇరిగేషన్ శాఖ రూ.  14 వేల 190 కోట్ల బకాయిలు చెల్లించాలి. వివిధ శాఖలు రూ. 29 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి.     రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి.  వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు కాంగ్రెస్  ప్రభుత్వం కట్టుబడి ఉంది.