
- 179 కోట్లు చెల్లించాలని సీఈఆర్సీ ఇచ్చిన నోటీసులపై స్టే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలైన ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) జారీ చేసిన నోటీసును హైకోర్టు నిలిపివేసింది. రూ.179 కోట్ల విద్యుత్ సరఫరా లోటు ఛార్జీల బకాయిలను చెల్లించాలంటూ సీఈఆర్‌సీ ఇచ్చిన డిమాండ్ నోటీసుపై స్టే ఇచ్చింది. గ్రిడ్‌కు అదనపు విద్యుత్ అందించినందుకు రూ. 179 కోట్ల బకాయిలు చెల్లించాలని సీఈఆర్సీ ఆదేశించగా.. దీనిని సవాలు చేస్తూ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ పి. శ్యాంకోశీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. వాదనలను విన్న ధర్మాసనం, రూ.179 కోట్ల పాత బకాయిల నోటీసు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తాజా లోటు ఛార్జీలను చెల్లించాలని ఆదేశించింది.