
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL కస్టమర్లకు దసరా కానుకగా గుడ్ న్యూస్ అందించింది. డిసెంబర్ నాటికి ఢిల్లీ సహా ముంబైలో BSNL 5G సేవలను ప్రారంభించనుంది. గత కొంతకాలంగా BSNL 4G & 5G సేవల కోసం ప్రజలు ఎంతో ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో BSNL 4G సర్వీసెస్ ఇప్పటికే మొదలయ్యాయి. గత సంవత్సరం జూలైలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచినప్పుడు, చాల మంది BSNLకి మారారు. దింతో BSNLకి లాభాల పంట పండింది. అయితే, BSNL 5G & 4G సేవల కోసం చాలా కాలంగా వేచి ఉండటం వల్ల BSNL గత కొన్ని నెలలుగా క్రమంగా కస్టమర్లను కోల్పోతోంది. అయితే 5G సేవల లాంచ్ వార్త మళ్ళీ యూజర్లను తిరిగి పొందగలదని ఆశిస్తున్నారు.
సమాచారం ప్రకారం BSNL 5G లాంచ్ గురించి టెలికమ్యూనికేషన్స్ సీనియర్ అధికారి మాట్లాడుతూ, 5G సేవలను అందించడానికి దేశంలో తయారుచేసిన పరికరాల పరీక్ష కొనసాగుతోందని, ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు కనిపించలేదని... అందువల్ల డిసెంబర్ 2025 నాటికి రెండు ప్రముఖ నగరాల్లో 5G సేవలు ప్రారంభం ఆవుతాయని అంచనా వేస్తున్నాము." అని అన్నారు.
లక్ష 4G సైట్లు :సమాచారం ప్రకారం ప్రభుత్వం TCS-Tejas-C-DoT కన్సార్టియంతో రూ.25వేల కోట్ల ఒప్పందం చేసుకుంది. 100,000 కంటే ఎక్కువ 4G సైట్‌లను స్థాపించడమే లక్ష్యం. ఈ సైట్‌లను 5Gకి కూడా అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ రోజు వరకు, BSNL దేశవ్యాప్తంగా 95,000 4G టవర్లను ఏర్పాటు చేసింది.