మీకు వచ్చిందా : మొబైల్ ఫోన్ల తయారీ ఇండస్ట్రీలో 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయి

మీకు వచ్చిందా : మొబైల్ ఫోన్ల తయారీ ఇండస్ట్రీలో 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయి

మొబైల్ ఫోన్ల తయారీ రంగంలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ ఐ) పథకం కింద భారత్ 5 లక్షల ఉద్యోగాలను సృష్టించిందని టెలికాం, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. గురువారం (డిసెంబర్ 01) ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్ కొత్త తయారీ ప్లాంట్ ను ప్రారంభించారు మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎల్ ఐ ద్వారా మొబైల్ పరిశ్రమలో ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలను కల్పించాం.. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అన్నారు. ప్యాడెక్ట్ ఎలక్ట్రానిక్స్ ఏడాదికి 25 మిలియన్ల ఫోన్లను తయారు చేస్తుందని చెప్పారు. 

Dixon Technlogies అనుబంధ సంస్థ అయిన padget Electronics 256 కోట్లతో నోయిడాలో తన కొత్త తయారీ యూనిట్ ను ప్రారంభించింది. గత త్రైమాసికంలో Xiaomi  పరికరాల ఉత్పత్తిని ప్రారం భించిందన్నారు మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఈ కంపెనీనీ స్మార్ట్ ఫోన్లు, ఫీచర్ ఫోన్లను తయారీ చేస్తుందన్నారు. కొత్త కంపెనీతో మరో 5వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. జీడీపీ కూడా పెరుగుతుందన్నారు. భారత్ లో మొబైల్ ఫోన్ల డిజైన్, కాంపోనెంట్ తయారీ అభివృద్ధిని కేంద్రం ప్రోత్సహిస్తోందన్నారు అశ్వీనీ వైష్ణవ్. ఎగుమతులే లక్ష్యంగా మొబైల్ ఫోన్ భాగాలను తయారు చేయడంపై దృష్టి పెట్టాలని కంపెనీకి సూచించారు. 

స్వదేశీ స్మార్ట్ ఫోన్ల తయారీ , ఎగుమతి లక్ష్యంగా 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని  ప్రవేశపెట్టింది. యాపిల్ సహా పలు చైనా బ్రాండ్ లపై ఆధారపడకుండా స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలను విస్తరించేందుకు మొబైల్ ఫోన్ తయారీ దారులను  పీఎల్ ఐ పథకం ద్వారా కేంద్రం ప్రోత్సహిస్తోంది. 2023లో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 100 బిలియన్ డాలర్లకు పెరగడంతో భారత ఎలక్ట్రానిక్స్ తయారీ పెరిగింది.