సిమ్​ డీయాక్టివేట్​ అయినా...90 రోజుల వరకు ఖాళీగానే: ట్రాయ్

 సిమ్​ డీయాక్టివేట్​ అయినా...90 రోజుల వరకు ఖాళీగానే: ట్రాయ్
  • సుప్రీంకు వెల్లడించిన ట్రాయ్​

న్యూఢిల్లీ: కస్టమర్​ రిక్వెస్ట్​ మేరకు మొబైల్ ఫోన్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఒకసారి డీయాక్టివేట్ చేసినా లేదా డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కనెక్ట్ చేసినా కనీసం 90 రోజుల వరకు ఆ సిమ్​కార్డు నంబరును కొత్త సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్లకు కేటాయించబోమని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సుప్రీంకోర్టుకు తెలిపింది.మొబైల్ నంబర్ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కనెక్ట్ అయిన తర్వాత లేదా డీయాక్టివేట్ అయిన తర్వాత, డేటా దుర్వినియోగం అవుతుందంటూ దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. 

విచారణ సందర్భంగా న్యాయ మూర్తులు సంజీవ్ ఖన్నా , ఎస్​వీఎన్​ భట్టిలతో కూడిన బెంచ్​ ట్రాయ్​ కౌంటర్ అఫిడవిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిగణనలోకి తీసుకుంది. చందాదారుడు పాత ఫోన్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో యాక్టివేట్​ చేసుకున్న వాట్సాప్ ఖాతాను తొలగించడం ద్వారా మొబైల్​, క్లౌడ్​, డ్రైవ్​లోని డేటాను మొత్తం డిలీట్​ చేయవచ్చన్న ట్రాయ్​ వాదనతో ఏకీభవించింది.  ప్రస్తుత రిట్ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మరింత ముందుకు సాగడానికి మేం ఇష్టపడటం లేదు, ఎందుకంటే... ట్రాయ్​ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్​తో మేం ఏకీభవిస్తున్నాం. 

మొబైల్ నంబర్ ఉపయోగించని కారణంగా డీయాక్టివేట్​అయితే కొత్త సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్​కు కనీసం 90 రోజుల వరకు ఇవ్వబోమని ట్రాయ్​ స్పష్టంగా తెలియజేసింది" అని బెంచ్ తెలిపింది. తన డేటా లీక్ కాకుండా పాత కస్టమరే చర్యలు తీసుకోవాలని గత నెల 30న జారీ చేసిన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. వాట్సాప్ సహాయ కేంద్రంలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఫోన్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను రీ-సైకిల్ చేసిన సందర్భంలో గందరగోళాన్ని తొలగించడానికి,  ఖాతా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాక్టివిటీని పరిశీలిస్తారు. అకౌంట్​ 45 రోజుల పాటు ఖాళీగా ఉండి వేరే డివైజ్​లో యాక్టివేట్​ అయితేనే పాత ఖాతా డేటాను తీసేస్తాం”అని వాట్సాప్​ పేర్కొంది.