టాటా సాయంతో గాంధీ ఆస్పత్రిలో టెలి మెడిసిన్​ సేవలు

టాటా సాయంతో గాంధీ ఆస్పత్రిలో టెలి మెడిసిన్​ సేవలు
  • బస్తీ దవాఖానలు, పీహెచ్​సీ లను ఆస్పత్రికి కనెక్ట్​

పద్మారావునగర్, వెలుగు: గాంధీ దవాఖానలో త్వరలో టెలి మెడిసిన్​సేవలు షురూ కానున్నట్టు సూపరింటెండెంట్​ డా.రాజారావు తెలిపారు. ఇందుకు టాటా ట్రస్ట్​ఆర్గనైజర్స్​ సీఎస్​ఆర్ ( కార్పొరేట్​సోషల్​రెస్పాన్సిబిలిటీ )​ కింద సాఫ్ట్​వేర్​, హార్ట్​వేర్​ను అందించినట్టు పేర్కొన్నారు. బుధవారం టెలి మెడిసిన్​సేవలపై దవాఖానలోని అన్ని డిపార్ట్​మెంట్ల ఆర్ఎం​వోలు, హెచ్ వోడీలు, సీఎస్​ఆర్ఎంవో –1​, అడ్మినిస్ర్టేషన్​అధికారులు, అసిస్టెంట్​ప్రొఫెసర్లు, డాక్టర్లకు ఓరియెంటేషన్​ లైవ్​ డెమోను సెమినార్​హాల్ లో  నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్లు, హబ్​ కో ఆర్డినేటర్లకు ట్రైనింగ్​ఇచ్చారు.  ఆస్పత్రి సూపరింటెండెంట్​మాట్లాడుతూ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్​ ఆదేశాల మేరకు గాంధీలో టెలి మెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.  ఇక నుంచి బస్తీ దవాఖానలు, పీహెచ్​సీ ల నుంచి ఆన్​లైన్  ద్వారా పేషెంట్లు  గాంధీ డాక్టర్లను కాంటాక్ట్​ అయి మెడిసిన్​, సర్జరీ, పీడియాట్రిక్​, గైనకాలజీ, ఈఎన్​టీ, ఆప్తామాలజీ, ఆర్ధోపెడిక్​, డీవీఎల్​, ఫిజియోథెరఫీల్లో  డాక్టర్ల నుంచి సలహాలు, ట్రీట్​మెంట్​గురించి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.