
తెలుగులో యంగ్ హీరో రోషన్ నటించిన పెళ్లి సందD సినిమాతో ఇండస్ట్రీ హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. ఈ క్రమంలో ప్రిన్స్ మహేష్, అల్లు అర్జున్, బాలకృష్ణ తదితర స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజా రవితేజ తదితర స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క చదువులో కూడా బాగానే రాణిస్తోంది. శ్రీలీల ఎంబీబీఎస్ డాక్టర్ చదువుతోంది. 2023లో చాలా బిజీగా గడిపిన ఈ బ్యూటీ పెండింగ్ షూటింగ్లు పూర్తి చేసి, ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పూర్తి చేసింది. ఇప్పుడు చేతిలో డిగ్రీతో శ్రీలీల ఆనందంగా ఉంది. దీంతో యాక్టర్ శ్రీలీల కాస్తా డాక్టర్ శ్రీలీలగా మారిపోయింది.
Also Raed : ‘రాబిన్‍హుడ్’ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్
ప్రస్తుతం సినిమాల పరంగా శ్రీలీల కెరీర్ పీక్స్ లో ఉంది. ఒక్కో సినిమాకి బడ్జెట్ ని బట్టి దాదాపుగా రూ.2 నుంచి రూ.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. డాక్టర్ చదువు పూర్తి చేసిన శ్రీలీల సినిమాల్లో కొనసాగుతుందో లేక డాక్టర్ గా ప్రజలకి సేవలందించడానికి సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతుందో అనే సందేహాలు ఎక్కువయ్యాయి ఆడియన్స్ కి. దీంతో డాక్టర్ డిగ్రీ, సినీ కెరీర్ వంటి విషయాలపై శ్రీలీల స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి నటి శ్రీలీల తాజాగా నటించిన రాబిన్ హుడ్ సినిమా శుక్రవారం (మార్చ్ 28) రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి భీష్మ మూవీ ఫేమ్ డైరెక్టర్ వెంకీ కుడుములు దర్శకత్వం వహించగా నితిన్ హీరోగా నటించాడు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఇక శ్రీలీల రాబోయే సినిమాల గురించి చూసినట్లైయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్", మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న "మాస్ జాతర" సినిమాలతోపాటు హిందీ, తమిళ్, కన్నడ తదితర భాషల్లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.