తెలుగు- కన్నడ సంస్కృతుల మధ్య బలమైన బంధం

తెలుగు- కన్నడ సంస్కృతుల మధ్య బలమైన బంధం
  • ఘనంగా కన్నడ రాజ్యోత్సవం..పాల్గొన్న సిటీ పోలీస్​ బాస్​సజ్జనార్​

 హైదరాబాద్​ సిటీ, వెలుగు: తెలుగు– -కన్నడ సంస్కృతుల మధ్య బలమైన బంధం ఉందని హైదరాబాద్​పోలీస్​కమిషనర్​వీసీ సజ్జనార్​అన్నారు. కాచిగూడ‌లోని క‌ర్నాట‌క సాహిత్య మందిర‌లో కన్నడ రాజ్యోత్సవం శ‌నివారం సాయంత్రం ఘ‌నంగా జ‌రిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. 

హైదరాబాద్ సంస్కృతి, -సంస్కరణల్లో కన్నడిగుల పాత్ర ప్రముఖమైనదన్నారు. స్వామి రామానంద తీర్థ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కాళోజీ నారాయణ రావు, తదితర ప్రముఖులు కన్నడ ప్రాంతం వారేనని గుర్తుచేశారు. త‌న ఉన్నతికి క‌ర్నాట‌క సంస్కృతి కీల‌క‌పాత్ర పోషించింద‌ని గుర్తు చేసుకున్నారు. 

90 ఏండ్లకు పైగా హైదరాబాద్ లో కర్నాటక సాహిత్య మందిరం చేస్తున్న సేవలను ప్రశంసించారు. కార్పొరేట‌ర్ ఉమార‌మేశ్ యాదవ్‌, క‌ర్నాట‌క సాహిత్య మందిర అధ్యక్షుడు సురేంద్ర క‌ట్గేరి, క‌ర్నాట‌క మ‌హిళా మండ‌లి అధ్యక్షురాలు జ‌య‌ల‌క్ష్మి క‌ట్గేరి, కార్యదర్శి న‌ర‌సింహా మూర్తి , ప‌రిమ‌ళ ముకుంద్ కుల‌క‌ర్ణి, ముకుంద్ కుల‌క‌ర్ణి, రాఘవేంద్ర దేశాయ్‌,  శ్రీకాంత్ కుల‌క‌ర్ణి పాల్గొన్నారు.