మొదలైన టీఎఫ్సీసీ ఎన్నికల పోలింగ్

మొదలైన టీఎఫ్సీసీ ఎన్నికల పోలింగ్

తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ లో ఎన్నికల హడావుడి మొదలైంది. అధ్యక్ష పదవి కోసం ప్రముఖ నిర్మాతలు సి కళ్యాణ్, దిల్ రాజు తలపడుతున్నారు. ఇక ఈ పోలింగ్ లో 1500 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

జులై 30 ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ లో పాల్గొనేందుకు నిర్మాతలు పెద్ద ఎత్తున​ ఫిల్మ్‌ చాంబర్‌కు తరలి వస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ పోలింగ్‌ జరగనుంది. విజేతలను సాయంత్రం 6 గంటలకు ప్రకటించనున్నారు. ఇందుకోసం పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.