ఏపీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్

ఏపీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కృతజ్ఞతలు తెలిపింది. కరోనా ప్రభావంతో సినిమా ఇండస్ట్రీ నష్టాల్లో కూరుకుపోయిందని.. 9 నెలల కరెంట్ చార్జీలు రద్దు చేయాలని కోరుతూ సినీ ఇండస్ట్రీ ప్రతినిధులు సీఎం జగన్‌ను కలిశారు. దానికి స్పందించిన సీఎం జగన్.. మూడు నెలల పాటు కరెంట్ చార్జీలు రద్దు చేస్తూ జీవో ఇచ్చారు. దాంతో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు సీ. కళ్యాణ్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మూడు నెలలతో పాటు మిగతా నెలలు కూడా చార్జీలు రద్దు చేస్తారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి జనరల్ సెక్రెటరీ దామోదర ప్రసాద్, ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.