
కొన్ని చిత్రాలు కామెడీతో నవ్విస్తాయి..కొన్ని ఎమోషన్స్ తో బాధిస్తాయి. మరికొన్ని ఆలోచింపజేస్తాయి..మరికొన్ని సినిమాలైతే హార్రర్ తో భయపట్టేస్తాయి. ఇదంతా ఇపుడు ఎందుకు అంటే. రీసెంట్ గా థియేటర్లలో రిలీజై ఆడియాన్స్ ను భయపెట్టిన పిండం సినిమా గురించి. గతనెల (డిసెంబర్ 15న) థియేటర్స్కి ఆడియాన్స్కు హార్రర్ ఇంటెన్స్ క్రియేట్ చేసింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..పిండం సినిమా త్వరలో ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది.ఈ సినిమాని ప్రముఖ ఆహా వీడియో ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ డిసైడ్ అయ్యారు. పిండం ఓటీటీ రిలీజ్ పై సంబంధించి..ఆహా వీడియో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ..ఉత్కంఠ పెంచేసింది. థియేటర్లోకి వచ్చి భయపెట్టిన పిండం..త్వరలో మీ ఇంటి ఓటీటీకి వచ్చేస్తుంది..అంటూ చెప్పుకొచ్చింది ఆహా. కానీ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందనే విషయం మాత్రం వెల్లడించలేదు.
Keep guessing??⬛
— ahavideoin (@ahavideoIN) January 25, 2024
Coming soon on aha… pic.twitter.com/rDg57y7NUn
ఆహా అతి త్వరలోనే పిండం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రంలో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించగా, సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించాడు.