ఈ వారం పండగే: ఓటీటీలోకి తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీస్.. మైథికల్, యాక్షన్, హారర్ జోనర్లో

ఈ వారం పండగే: ఓటీటీలోకి తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీస్.. మైథికల్, యాక్షన్, హారర్ జోనర్లో

ఈ వారం (అక్టోబర్ సెకండ్ వీక్) ఓటీటీలోకి రెండు కొత్త సినిమాలు దర్శనం ఇవ్వనున్నాయి. సెప్టెంబర్లో థియేటర్లలలో రిలీజైన ఈ రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చి అలరించాయి. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సైతం రాబట్టాయి. అయితే, ఈ రెండు తెలుగు సినిమాలు దేనికదే విభిన్న జోనర్లో రావడం, ఇపుడు ఓటీటీ ఆడియన్స్కి స్పెషల్గా ఉండనుంది. అందులో ఒకరి హారర్ మిస్టరీ థ్రిల్లర్ కాగా, మరొకటి మైథికల్ యాక్షన్ అడ్వెంచర్. మరి ఆ సినిమాలు ఏంటీ? అవెక్కడ స్ట్రీమింగ్కి రానున్నాయి? అందుబాటులో ఎపుడు ఉండనున్నాయి? అనేది చూసేద్దాం!!

మిరాయ్:

తేజ సజ్జా హీరోగా, కార్తీక్ గట్టమనేని దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ తెలుగు థ్రిల్లర్ మిరాయ్. ఈ సినిమా కోసం ఓటీటీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 10, 2025 నుండి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ మినహా అన్ని ప్రధాన భారతీయ భాషలలో అందుబాటులో ఉండనుంది. గత వారమే ఈ విషయాన్ని హాట్‌స్టార్‌ అనౌన్స్ చేసింది. 

హీరో తేజ సజ్జాకి మిరాయ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. హనుమాన్ తర్వాత మిరాయ్తో మరోసారి వందకోట్ల క్లబ్లో చేరేలా చేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.141 కోట్లకుపైగా వసూలు చేసింది. అయితే, సెప్టెంబర్ 12న రిలీజైన ఈ సూపర్ హిట్ మూవీ, నెలరోజుల లోపే ఓటీటీలోకి వస్తుండటం విశేషం. 

‘కిష్కింధపురి’:

బెల్లకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన హారర్ మిస్టరీ మూవీ ‘కిష్కింధపురి’. కౌశిక్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం సెప్టెంబర్ 12న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో మూవీ ఓటీటీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే శుక్రవారం (అక్టోబర్ 10న) జీ5 ఓటీటీలోకి అడుగుపెడుతోందని టాక్ వినిపిస్తుంది. అలాగే, దీపావళి కానుకగా (అక్టోబర్ 17) నుంచి అని కూడా మరో టాక్ ఉంది.

►ALSO READ | Samantha: 'ఏ మాయ చేశావే' హీరోతో మళ్లీ సమంత జోడీ.. బ్లాక్ బస్టర్ మూవీ యూనివర్స్‌లో ఎంట్రీ!

ఈ విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.30 కోట్ల వరకూ గ్రాస్ వసూళ్లు సాధించినట్లు టాక్. 

‘త్రిబాణధారి బార్బరిక్‌’:

రీసెంట్ తెలుగు మిస్టరీ థ్రిల్లర్ ‘త్రిబాణధారి బార్బరిక్‌’. సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటించారు. మోహన్ శ్రీవత్స తెరకెక్కించారు. దర్శకుడు మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించారు. ఆగస్ట్ 29న రిలీజైన ఈ మూవీ ఓటీటీలో అడుగుపెట్టనుంది. అక్టోబర్ 10 నుంచి సన్ NXTలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఈ మూవీ కథ, కథనాలు బాగున్నప్పటికీ, వసూళ్ల విషయంలో వెనకబడిపోయింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ మోహన్ శ్రీవత్స చెప్పుతో కొట్టుకుని వీడియో రిలీజ్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు. 

ఏదేమైనా..,ఈ మూడు సినిమాల్లో  ‘మిరాయ్’, ‘త్రిబాణధారి బార్బరిక్‌’ స్ట్రీమింగ్ డేట్స్ అఫీషియల్గా అనౌన్స్ అయ్యాయి. ‘కిష్కింధపురి’ మూవీ స్ట్రీమింగ్పై సందిగ్దత నెలకొంది.