ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్’. ఎస్ జె సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
బుధవారం ఈ మూవీ టీజర్‌ను రానా దగ్గుబాటి రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. ‘ప్రపంచం ఎక్కడికో వెళ్లిపోయింది.. మనం ఇప్పుడు 2040లో ఉన్నాం. కానీ ఒకడు లేని ఒక విషయాన్ని ఉందని అంటున్నాడు’ అనే వాయిస్‌తో ప్రారంభమైన టీజర్ క్రేజీగా ఆకట్టుకుంది.
‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఇంకా ఉంది. ఈ అమ్మాయిని చూడగానే అర్థమైంది’ అని ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టిని పరిచయం చేశారు. వీరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా కనిపించింది. ఎస్.జె. సూర్య ఎంట్రీ టీజర్‌కు మరో హైలైట్‌గా నిలిచింది.
దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ క్రేజీ లవ్ స్టోరీని ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో డిజైన్ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రవి వర్మన్ కెమెరా వర్క్ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
