
చెన్నై: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ ఎడిషన్‌లో తెలుగు టైటాన్స్ దూసుకెళ్తోంది. లీగ్‌లో వరుసగా నాలుగో, మొత్తంగా ఏడో విజయం అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 40–35 తేడాతో యూపీ యోధాస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. ఆల్‌రౌండర్ విజయ్ భరత్ 14 పాయింట్లతో విజృంభించగా.. కెప్టెన్ విజయ్ మాలిక్ (9), డిఫెండర్ శుభం షిండే (5) కూడా రాణించారు. యూపీ జట్టులో స్టార్ రెయిడర్ భవానీ రాజ్‌పుత్ (16), గుమన్ సింగ్ (8) పోరాడినా తమ జట్టుకు ఓటమి తప్పించలేకపోయారు.