హైదరాబాద్, వెలుగు: ఈ నెల 28న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 16వ కాన్వొకేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రవీంద్రభారతిలో జరిగే ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారని వర్సిటీ వీసీ కిషన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. పీహెచ్ డీ, పీజీ, డిగ్రీ సర్టిఫికేట్లను, పట్టాలను స్టూడెంట్లకు అందించనున్నట్టు చెప్పారు.
ఆయా విభాగాల్లోని టాపర్లకు ప్రముఖుల పేరిట ఏర్పాటు చేసిన గోల్డ్ మెడల్స్ అందించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పేరిణి, ఆంధ్రనాట్యానికి సేవలందిస్తున్న ప్రముఖ నాట్యగురువు కళాకృష్ణకు వర్సిటీ గౌరవ డాక్టరేట్ ను అందిస్తామని కిషన్ రావు పేర్కొన్నారు.
