12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు

12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు

హైదరాబాద్, వెలుగు :  పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 2022 సంవత్సరానికి గానూ 12 మందిని ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసింది.  ఏటా వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులకు వర్సిటీ ఈ పురస్కారాలు అందిస్తుంది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్​ ఎంపికైన వారి పేర్లను ప్రకటించారు. వెంకటేశ్వరాచార్యులు(కవిత్వం), డాక్టర్ రాజారెడ్డి (పరిశోధన), అన్నవరం శ్రీనివాస్ (చిత్రలేఖనం),  టి.గంగాధర్ (శిల్పం),  పసుమర్తి రామలింగశాస్త్రి (నృత్యం), డాక్టర్ పప్పు వేణుగోపాలరావు (సంగీతం), దిలీప్ రెడ్డి(పత్రికా రంగం), కల్యాణి (నాటకం), కొంకుల్ల ఎల్లయ్య (జానపద కళారంగం),  గండ్ర లక్ష్మణరావు (అవధానం), కొలకలూరి మధుజ్యోతి (ఉత్తమ రచయిత్రి),  దేవులపల్లి కృష్ణమూర్తి (నవల/కథ) పురస్కారాలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ నెల28న తెలుగు వర్సిటీలో జరిగే కార్యక్రమంలో పురస్కారాలను అందిస్తామని చెప్పారు. పురస్కారంతో పాటు రూ.20,116లను అందించి సత్కరిస్తామని పేర్కొన్నారు.