పాక్ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ విడుదలయ్యాడు. మంగళవారం ప్రశాంత్ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న ప్రశాంత్ 2017 లో తన ప్రియురాలి కోసం పాకిస్తాన్ మీదుగా స్విట్జర్లాండ్ వెళ్లే క్రమంలో పాక్ అధికారులకు పట్టుబడ్డాడు.
ఎలాంటి వీసా, పాస్‌పోర్టు లేకుండా పాక్ భూభాగంలో అడుగుపెట్టడంతో ప్రశాంత్‌ను పాక్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నారు. 2019లో తన కుమారుడిని రప్పించే ప్రయత్నం చేయాలంటూ సైబరాబాద్ సిపి సజ్జనార్‌ను ప్రశాంత్ తండ్రి బాబురావు కలిశారు. విదేశాంగ శాఖ సహకారంతో ప్రశాంత్‌ను తిరిగి స్వదేశానికి రప్పించారు. ఇంతకాలం పాక్‌లోనే ఉన్న ప్రశాంత్‌ను తాజాగా వాఘా సరిహద్దులో భారత్‌కు పాక్ అధికారులు అప్పజెప్పారు. ప్రశాంత్ విడుదలతో అతని సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
