సిమ్లా శివాలయం శిథిలాల కింద..ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ సమాధి..

సిమ్లా శివాలయం శిథిలాల కింద..ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ సమాధి..

హిమాచల్ ప్రదేశ్:సిమ్లాలోని సమ్మర్ హిల్స్ ప్రాంతంలో నాలుగో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శివాలయం కూలిన ప్రదేశంలో ఆర్మీ, ఎస్ డీఆర్ ఎఫ్, పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలో పాల్గొన్నారు. గల్లంతైన 21 మందిలో ఇప్పటివరకు 14 మంది మృతదేహాలను వెలికి తీశారు. గురువారం రెండు మృతదేహాలను వెలికి తీయగా ఒక మృతదేహం హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ పీఎల్ శర్మదిగా గుర్తించారు. మొత్తం 78 మంది ఆలయం శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.  

సిమ్లాలో దాదాపు అరడజను భవనాలు కొండచరియలు విరిగిపడటంతో నేలమట్టమయ్యాయి. మరోవైపు కాంగ్రా జిల్లాలో పాంగ్ డ్యామ్ నుంచి వరద కారణంగా సమీప ప్రాంతాలు జలమయం కాగా.. 1,731 మందిని రక్షించారు. కొండచరియలు విరిగిపడటంతో సిమ్లాలోని వివిధ ప్రాంతాల్లోని అనేక ఇళ్లు కూలిపోయాయి. వర్షాల కారణంగా 500కు పైగా చెట్లు నేలకూలాయి. 

హిమాచల్ లో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టంపై సీఎం సుఖ్ విందర్ సింగ్ సమీక్ష నిర్వహించారు. గత నాలుగు రోజులుగా 157 శాతం వర్షపాతం పెరగడంతో రాష్ట్రవాప్తంగా అపార నష్టం వాటిల్లిందని తెలిపారు. మరి కొన్ని రోజులు వర్షాలు న్న కారణంగా రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చారు.