అన్నార్థుల ఆకలి తీర్చే ఆలయం

అన్నార్థుల ఆకలి తీర్చే ఆలయం
మహారాష్ట్ర కిన్వట్‌‌లోని ఆలయం ఎంతోమంది అన్నార్ధుల ఆకలి తీరుస్తోంది. ప్రతిరోజూ ఆలయంలో అన్నం వండి ఊళ్లో పేదల ఆకలి తీరుస్తున్నాడు అర్చకుడు పవార్‌‌‌‌స్వామి. అంతేకాదు.. ఈ ఆలయం 375 ఆవులకు ఆశ్రయం ఇచ్చింది. ఆలయం ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. సాయి సేవ అంటే.. పేదవాళ్లకు సేవ చేయడమే అంటాడు సాయిబాబా ఆలయ అర్చకుడు పవార్‌‌‌‌స్వామి. అందుకే పేదల ఆకలి తీర్చేందుకు స్వయంగా ఆయనే వంట చేసి, వండినదాన్ని  బైక్‌‌పై తీసుకెళ్లి పేదలు ఉండే ఏరియాలో పంచుతాడు. రెండేళ్లుగా ప్రతిరోజూ ఇదే ఆయన దినచర్య. సాయంత్రం ఐదు అయ్యిందంటే చాలు.. పేదలంతా ఇళ్ల నుంచి బయటికొచ్చి పవార్‌‌‌‌ స్వామి కోసం ఎదురు చూస్తుంటారు. సాయికి హారతి ఇవ్వగానే ఆయన బైక్‌‌పై ఫుడ్‌‌ పెట్టుకుని కాలనీలకు వస్తాడు. ఆయన దగ్గరికి వచ్చినవాళ్లకు లేదనకుండా అన్నం, పప్పు ఇస్తాడు. తర్వాత హాస్పిటల్స్‌‌ దగ్గరకు వెళ్లి పేషెంట్లకు, పేషెంట్లతో వచ్చినవాళ్లకు అన్నం పెడతాడు. ముఖ్యంగా సాఠెనగర్​, అంబేద్కర్​చౌక్, అన్నాబావునగర్​, రాంనగర్​, రైల్వేస్టేషన్, మైమూన్​పుర కాలనీల్లో పేద ప్రజలు ప్రతిరోజూ పవార్​ స్వామి కోసం ఎదురుచూస్తుంటారు. ఆయన రోజుకు 45కిలోల బియ్యం, 10కిలోల పప్పుతో కూర వండుతాడు. వాటితో పాటు దాతలు ఇచ్చే స్వీట్లు కూడా ప్రతిరోజూ పంచుతాడు. కిన్వట్‌‌​లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి.. ఇంటికి తీసుకెళ్లి అన్నం పెడతాడు పవార్‌‌‌‌. కులమతాలకు అతీతంగా అందరి ఆకలి తీరుస్తాడు. అంతేకాదు అప్పుడప్పుడు కంటి పరీక్షలు, బ్లడ్‌‌ డొనేషన్‌‌ క్యాంప్స్‌‌, సామూహిక వివాహ మేళా ఏర్పాట్లు చేస్తుంటాడు. 365 గోవులతో గోశాల సాయిబాబా ఆలయం దగ్గరలో రాజేంద్రచడావార్​ ఒక గోశాలను నడుతుపుతున్నారు. 2011లో దీన్ని పది ఆవులతో ఏర్పాటు చేశారు.  ఇప్పుడు అందులో 375 ఆవులు ఉన్నాయి. ఈ ఆవుల పాలను దూడల కోసమే వదిలేస్తారు. ఆవుల బాగోగులు చూడ్డానికి ఇరవై మంది పనిచేస్తున్నారు. దీనికోసం ఆలయ కమిటీ నెలకు 3.5 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. అంతేకాదు గోశాలలోని ఎడ్లను పైద రైతులకు ఇస్తున్నారు. ఇప్పటిదాకా28 జతల ఎడ్లు దానం చేశారు. ప్రతి రోజూ ఎదురు చూస్తాం మాకు కళ్లు లేవు. పవార్ ​స్వామి కోసం ప్రతిరోజూ ఎదురు చూస్తాం. ఆయన అన్నం పెట్టడం వల్లనే మా కడుపు నిండుతుంది. ప్రతి రోజూ తప్పకుండా సరిగ్గా ఐదు గంటలకు అన్నం తీసుకొస్తాడు. ముఖ్యంగా ఆయన వల్ల పేదలు, దివ్యాంగులు, వృద్ధుల ఆకలి తీరుతుంది. అప్పుడప్పుడు కంటి పరీక్షలు, బ్లడ్‌‌ డొనేషన్‌‌ క్యాంప్స్‌‌ ఏర్పాటు చేస్తుంటాడు పవార్​ స్వామి. -రాజు, వందన, గంగానగర్​, కిన్వట్​ పాతికేళ్లుగా సాయి సేవలో.. ఆలయం పక్కనే నాకు ప్రి ఫ్యాబ్రిక్ వ్యాపారం ఉంది. ఎక్కువ టైం గుడి దగ్గరే ఉంటా. పాతికేళ్లుగా సాయిబాబా సేవ చేస్తున్నా. ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష స్వీకరిస్తున్నా. ఆలయంలో మహా పడిపూజ చేస్తున్నా. ప్రతి సంవత్సరం దాదాపు వంద మంది స్వాములు సాయి సన్నిధానంలో ఉంటారు. హనుమాన్​, సాయిదీక్షలు తీసుకునే స్వాములు కూడా ఇక్కడే ఉంటారు. ప్రతి రోజూ పేదల కోసం అన్నం వండి వాళ్ల ఇళ్లకే తీసుకెళ్లి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఆలయ కమిటీలో ప్రతిఒక్కరూ నాకు సహకరిస్తున్నారు. -పవార్​ స్వామి, కిన్వట్​ ఇవి కూడా చదవండి జడ్చర్ల నుంచి జపాన్ వరకు.. రక్తంలో పుట్టగొడుగులు మొలిచినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిల్లలను అద్దెకు తీసుకుని పెళ్లిళ్లకు వచ్చి ఏం చేస్తారంటే..