
కొమురవెల్లి, వెలుగు: ఈ నెల 7వ తేదీన జరిగే మల్లన్న కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు, అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్‌లో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అర్చక బృందం సీఎంను కలిసింది. ఈ సందర్భంగా రేవంత్‌కు ప్రసాదం, వేద ఆశీర్వచనాలతో మల్లికార్జున స్వామి వారి ఫొటోను అందజేసింది.
మల్లన్న కల్యాణోత్సవానికి రావాలని ఇన్వైట్ చేసింది. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి టెంపుల్ ప్రత్యేకతను ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున్, సూర్యకుమార్ రేవన, సిద్ధేశ్వర వీరేశలింగం సీఎం రేవంత్‌కు వివరించారు. కల్యాణోత్సవానికి తప్పకుండా వస్తానని సీఎం హామీ ఇచ్చారని అర్చకులు వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి కూడా తన వంతు సహకారం అందిస్తానని చెప్పారని వివరించారు.