లంగర్ హౌస్, జియాగూడలో గుడులు, సమాధులు, రోడ్లన్నీ మునక

లంగర్ హౌస్, జియాగూడలో గుడులు, సమాధులు, రోడ్లన్నీ మునక

మెహిదీపట్నం, వెలుగు: భారీ వర్షాలకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి మూసీ నది ఉగ్రరూపం దాల్చడంతో లంగర్ హౌస్, జియాగూడ ప్రాంతాల్లో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నది పరివాహక ప్రాంతాల వైపు ఎవరూ వెళ్లకుండా చూస్తున్నారు. లంగర్ హౌస్​బాపు ఘాట్​లోని గాంధీ సమాధి, సమీపంలోని సంగం రామాలయం, పక్కనే ఉన్న శివాలయం పూర్తిగా వరదలో మునిగిపోయాయి. 

రెండు రోజులుగా మూసీ ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండడంతో జియాగూడలో 100 ఫీట్ల రోడ్డు మొత్తం నీట మునిగింది. దీంతో స్థానిక పోలీసులు రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపారు. పురాన పూల్ సమీపంలోని శ్మశాన వాటిక, పురాతన శివాలయం కూడా వరదలో మునిగిపోయాయి.