ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ లో 2026 సంవత్సరానికి సంబంధించి అఖిల భారత పులుల గణన ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో శ్రీశైలం పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించింది అటవీశాఖ. నాగార్జున సాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఫేజ్ 3 కెమెరా ట్రాప్ ల ద్వారా పులుల గణన ప్రారంభించినట్లు తెలిపింది అటవీశాఖ. ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం రేంజ్‌లలో ఫిబ్రవరి 13 వరకు పులుల గణన కొనసాగుతుందని తెలిపింది అటవీశాఖ.
ఈ క్రమంలో వెంకటాపురం–హటకేశ్వరం, పెచ్చెరువు–నాగలూటి మార్గంలో శ్రీశైలం పాదయాత్రపై ఫిబ్రవరి 8 వరకు నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు ఆత్మకూరు DD విజ్ఞేష్ అప్పావ్. ఈ సమయంలో భక్తులు ఆత్మకూరు దోర్నాల రోడ్డు మార్గం వినియోగించాలని సూచించారు.
అయితే.. మహాశివరాత్రి దృష్ట్యా ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు పాదయాత్రకు అనుమతిస్తామని తెలిపారు అధికారులు.అఖిల భారత పులుల గణన విజయవంతానికి భక్తులు సహకరించాలని కోరింది అటవీశాఖ.
