హైదరాబాద్, వెలుగు: పప్పు దినుసులు తయారు చేసే తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ ఢిల్లీ ఇండియా ఎక్స్‌పోజిషన్ మార్ట్‌లో జరిగిన 'ఇండస్‌ఫుడ్ 2025'లో పాల్గొంది. ఈ ఎక్స్‌పో జనవరి 8న ప్రారంభమైంది. ఈనెల 10వ తేదీ వరకు జరగనుంది.
20 దేశాల నుంచి ఆహార ప్రాసెసింగ్ సంస్థలు, 1,800 పైగా ప్రదర్శకులు, 5,000 పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ఆహార పదార్థాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ వేదిక కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.