విద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి ... నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన

విద్యుత్ షాక్ తో కౌలు రైతు మృతి ... నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన

అచ్చంపేట, వెలుగు: విద్యుత్ షాక్ తో కౌలు రైతు చనిపోయిన ఘటన నాగర్​కర్నూల్​జిల్లాలో జరిగింది. బల్మూర్ ఎస్ఐ రాజేందర్ కథనం మేరకు.. ఉప్పునుంతల మండలం మర్రిపల్లికి చెందిన మెంట సలేశ్వరం(36) గత పదిహేనేండ్లుగా బల్మూరు మండలం ఇప్పకుంటకు చెందిన దేరెడ్డి దామోదర్ రెడ్డికి చెందిన 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. 

పత్తి, వరి, మక్కజొన్న పంటలను వేశాడు. బుధవారం సలేశ్వరం తన భార్య రేణమ్మతో కలిసి పొలం వద్ద పనులు చేసేందుకు వెళ్లారు. సాయంత్రం భార్య ఇంటికి వెళ్లగా అతను పొలం వద్దే ఉన్నాడు. రాత్రి అయినా భర్త ఇంటికి రాకపోవడంతో భార్య ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు వెళ్లి పొలం వద్ద వెతకగా రక్షణగా వేసిన విద్యుత్ కంచె వద్ద సలేశ్వరం చనిపోయి కనిపించాడు. బల్మూర్ పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతుడి భార్య రేణమ్మ ఫిర్యాదుతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.