108 నిర్వహణకు త్వరలోనే టెండర్లు

108 నిర్వహణకు త్వరలోనే టెండర్లు

108 వాహనాల నిర్వహణకు జీవీకే ఈఎంఆర్‌‌‌‌ఐ సంస్థతో ఉన్న కాంట్రాక్ట్‌‌ కాల పరిమితి ముగిసింది. దీంతో కొత్తగా టెండర్లు పిలవనున్నారు. నిబంధనలు రూపొందించి.. టెండర్ ఖరారు చేసేందుకు ఫ్యామిలీ వెల్ఫేర్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ నేతృత్వంలో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. కమిషనర్‌‌ చైర్ పర్సన్‌‌గా ఉండే ఈ కమిటీలో పబ్లిక్ హెల్త్‌‌ విభాగం డైరెక్టర్‌‌‌‌, వైద్య విధాన పరిషత్ కమిషనర్‌‌‌‌, టీఎస్‌‌ఎంఐడీసీ చీఫ్ ఇంజనీర్‌‌‌‌, స్టేట్‌‌ హెల్త్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ఆఫీసర్‌‌‌‌, రవాణాశాఖ జాయింట్‌‌ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు. 3 నెలల్లో కాంట్రాక్ట్‌‌ ప్రక్రియ ముగించాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. కొత్త కాంట్రాక్టర్‌‌‌‌కు బాధ్యతలు అప్పగించే వరకూ జీవీకే కొనసాగనుంది.