
ఆపరేషన్ సింధూర్ భారత్ విజయం.. ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాం..భారత్ సైన్యం ధైర్య సాహసాలకు ఇది నిదర్శనం అని ప్రధాని మోదీ అన్నారు. వానాకాలం పార్లమెంట్ సమావేశాల్లో ప్రసంగించిన మోదీ.. దేశం వ్యతిరేకులెవరో చూపిస్తానంటూ.. పహల్గాం దాడి, ఆ తర్వాత జరిగిన సంఘటనలను సభకు వివరించారు.
పహల్గాం దాడి అత్యంత క్రూరమైనది. మతాన్ని అడిగి మరీ చంపారు. దేశమంతా ఒక్కటై కుట్రలను ఓడించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు మోదీ. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశానికి నిద్ర లేకుండా చేశామన్నారు. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కు బెదరబోమని చెప్పామన్నారు.
ఏప్రిల్ 22 న పహల్గాం దాడి తర్వాత 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామన్నాయన. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ నిచ్చాం.. ఎక్కడ , ఎలా వ్యవహరించాలో తేల్చుకోవాలని సైన్యానికి చెప్పామన్నారు.
Also read:-ప్రధాని మోడీకి ధైర్యం ఉంటే.. ట్రంప్ అబద్దాలకోరు అని చెప్పాలి
భారత్ దెబ్బకు పాక్ ఎయిర్ బేస్ ఇప్పటికీ ICU ఉందనన్నారు ప్రధాని మోదీ. భారత్ తయారు చేసిన డ్రోన్లు, క్షిపణులు పాక్ ను కూల్చాయన్నారు మోదీ. గతంలో దాడులు చేసి ఉగ్రవాదులు ప్రశాంతంగా నిద్రపోయేవారు.. ఇప్పుడు దాడులు చేయాలంటేనే ఉగ్రవాదులకు చెమటలు పడుతున్నాయన్నారు.
ఆపరేషన్ సింధూర్ ను 193 దేశాలు సమర్థించాయి.. కేవలం మూడు దేశాలు మాత్రమే పాక్ ను సమర్థించాయన్నారు ప్రధాని మోదీ. మా చర్యలను ప్రపంచ దేశాలు సమర్థిస్తే.. కాంగ్రెస్ విమర్శిస్తోందన్నారు మోదీ. కొందరు ప్రతిపక్ష నేతలు పాక్ ప్రోపగండను అనుసరిస్తున్నారని విమర్శించారు. పాక్ తప్పుడు ప్రచారాలను విపక్షాలు ప్రచారం చేస్తున్నాయన్నారు మోదీ. మన సైన్యం100 శాతం టార్గెట్ ను పూర్తి చేసిందన్నారు.
అయితే ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ స్టేట్మెంట్ సమయంలో సభలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అంతకు ముందు పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఎన్డీయే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పహల్గాం దాడికి బాధ్యత వహించకుండా. . ఆపరేషన్ సింధూర్ క్రెడిట్ తీసుకుంటోందని విమర్శించింది. ఎన్డీయే సర్కార్ దృష్టి అంతా అధికారంపైనే ఉందన్నారు.