ప్రధాని మోడీకి ధైర్యం ఉంటే.. ట్రంప్ అబద్దాలకోరు అని చెప్పాలి: రాహుల్ గాంధీ

ప్రధాని మోడీకి ధైర్యం ఉంటే.. ట్రంప్ అబద్దాలకోరు అని చెప్పాలి: రాహుల్ గాంధీ

ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో చర్చ వాడివేడిగా సాగింది.. మంగళవారం ( జులై 29 ) ఆపరేషన్ సిందూర్ పై సభలో మాట్లాడుతూ ప్రధాని మోడీపై ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకులు బలయ్యారని.. దేశభద్రతపై కాంగ్రెస్ కేంద్రానికి అండగా ఉంటుందని అన్నారు. యుధం అపానని ట్రంప్ 29 సార్లు ప్రకటించారని.. ట్రంప్ అబద్దం చెప్పినట్లు ప్రధాని మోడీ సభలో అంగీకరించాలని అన్నారు రాహుల్ గాంధీ. మోడీకి దైర్యం ఉంటే ట్రంప్ అబద్దాల కోరు అని చెప్పాలని అన్నారు రాహుల్. ఇందిరా గాంధీ.

పహల్గామ్ ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడిందని అన్నారు. ఉగ్రదాడిని దేశప్రజలంతా ముక్తకంఠంతో ఖండించారని అన్నారు. భారత సైన్యం శక్తి సామర్థ్యాలపై అనుమానం లేదని అన్నారు. భారత సైన్యాన్ని పులితో పోల్చిన రాహుల్ గాంధీ, పులిని స్వేచ్ఛగా ఉంచాలని అన్నారు. త్రివిధ దళాలను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు రాజకీయ సంకల్పం ఉండాలని అన్నారు. 1971 యుద్ధంలో అప్పటి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని.. అప్పటి జనరల్ మాణిక్ షాకు ఇందిరా గాంధీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని అన్నారు.

Also read:-దేశ వ్యతిరేకులెవరో నేను చూపిస్తా

పహాల్గమ్ దాడిలో ఉగ్రవాదులు నిర్దయగా అమాయకులను చంపేశారని అన్నారు. పాక్ దుశ్చర్యను సభలో ప్రతిఒక్కరు ఖండించారని అన్నారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని పార్టీలన్నీ చెప్పాయని అన్నారు. ప్రతిపక్షంగా ఐక్యంగా ఉన్నందుకు గర్వపడుతున్నామని అన్నారు. యుద్ధం చేసే రాజకీయ సంకల్పం ప్రబుత్వానికి లేదని.. రక్షణ మంత్రి మాటలతో తేటతెల్లం అవుతోందని అన్నారు రాహుల్ గాంధీ. మీరు దాడులు చేయకండని పాక్ కు చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు రాహుల్ గాంధీ.