భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో రామాలయం అభివృద్ధి పనులకు రోడ్లు, భవనాల శాఖ టెండర్లను ఆహ్వానించింది. తొలిదశలో రూ.276 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 30 నెలల వ్యవధిలో పనులు పూర్తి చేయాలని టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జీఎస్టీ, ఇతర పన్నులు పోను రూ.200.89 కోట్ల విలువైన పనులు చేపట్టనున్నారు. టెండర్లు పిలిచిన వాటిలో పాత భవనాలు కూల్చడం, ప్రాకారాల నిర్మాణాలు వంటి ఇతరత్రా పనులు ఉన్నాయి.
