భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో గుర్తింపుసంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన సమ్మె నోటీస్‌పై హైదరాబాద్‌లో డిప్యూటీ లేబర్ కమిషనర్ ఎదుట గురువారం చర్చలు జరిపినట్లు యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె.రాజ్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య మీడియాకు తెలిపారు.
కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 8న సింగరేణి యాజమాన్యానికి 31 డిమాండ్లతో సమ్మె నోటీస్ అందజేశారు. సమ్మె నోటీస్‌పై సుదీర్ఘ చర్చల అనంతరం వచ్చే నెల 10న మరోసారి చర్చలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే సమ్మెకు సిద్ధంగా ఉండాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ నేతలు కె. సారయ్యతో పాటు సింగరేణి సంస్థ తరఫున ఏజీఎం పర్సనల్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
