అర్జున్ పాలిట టెండూల్కర్ పేరే శాపం

అర్జున్ పాలిట టెండూల్కర్ పేరే శాపం

టెండూల్కర్..భారత క్రికెట్లో ఈ పేరు ఒక సంచలనం. 16 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ టీమిండియాలో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించాడు . పూర్తి పేరు సచిన్ రమేష్​ టెండూల్కర్ అయినా..క్రికెట్ ప్రేమికులు మాత్రం టెండూల్కర్ అనే ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ఇప్పుడు  టెండూల్కర్ అనే పేరే శాపమైందట. 

సచిన్ టెండ్కూలర్ దిగ్గజ క్రికెటర్గా పేరు సంపాదించాడు. భారత రత్నగా కీర్తిప్రతిష్టలు దక్కించుకున్నాడు. అయితే  సచిన్..తన వారసుడిగా కొడుకు అర్జున్ టెండూల్కర్ను క్రికెట్లోకి తీసుకొచ్చాడు. అర్జున్ ఎడమచేతి వాటం బౌలర్. దీంతో సచిన్ తర్వాత అతని కుమారుడు టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అర్జున్ టీమిండియాకు కాదు కదా..కనీసం..ముంబై తరపున రంజీల్లో ..ఐపీఎల్లో కూడా అరంగేట్రం చేయలేకపోయాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో అర్జున్ టెండూల్కర్ ను ముంబై జట్టు కొనుక్కుంది. ప్రారంభం ధర రూ. 30 లక్షలకు అతన్ని తీసుకుంది. దీంతో ఐపీఎల్లో ముంబై తరపున అర్జున్ ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ ఒక్క మ్యాచ్లోనూ అతడికి అవకాశమే రాలేదు.

పేరే ప్రాబ్లమ్..
అర్జున్ టెండూల్కర్పై లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను రాణించకపోవడానికి కారణం..టెండూల్కర్ పేరే కారణమని చెప్పాడు. టెండూల్కర్ అన్న పేరే అర్జున్ను మరుగున పడేలా చేస్తుందన్నాడు.  అర్జున్ను సచిన్ తో పోల్చొద్దంటూ ఫ్యాన్స్ కు సూచించాడు. సచిన్లా అర్జున్ ఆడటం సాధ్యం కాదన్నాడు కపిల్. కనీసం అతడిలో 50 శాతం ఆడినా ..చాలన్నాడు. 

తోక తీసెయ్..
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అర్జున్ రాణించకపోవడానికి ఒత్తిడే కారణం అవుతుందన్నాడు కపిల్ దేవ్. టెండూల్కర్ అన్న పదంతోనే అర్జున్ ఒత్తడికి గురవుతున్నాడని జోస్యం చెప్పాడు.  ముందు తన పేరులో నుంచి టెండూల్కర్ అన్న పదాన్ని తొలగించాలని సూచించాడు. ప్రస్తుతం 22 ఏళ్ల వయసున్న అర్జున్కు క్రికెట్ ఆడేందుకు ఇదే సరైన సమయమని చెప్పుకొచ్చాడు. 

2021లో హర్యానాతో జరిగిన మ్యాచ్ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్..రెండు టీ–20లు మాత్రమే ఆడాడు. అందులో పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్లో 3 పరుగులు చేసి..బౌలింగ్లో ఒక వికెట్టే పడగొట్టాడు. హర్యానాతో మ్యాచ్లో ఒక వికెట్ తీసుకున్నాడు.