
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ ఇప్పుడు చర్చనీయాంశం..బలమైన ఆయుధ వ్యవస్థ, డిఫెన్స్ వ్యవస్థ ఉన్న దేశంలోకి చొరబడి ఉక్రెయిన్ ఎలా దాడి చేసింది..రష్యా కీలక వైమానిక స్థావరాలను ఎలా ధ్వంసం చేసింది..ఉక్రెయిన్ కు ఇంత ఆయుధ సంపత్తి, బలం ఎలా వచ్చింది..ఇదే ఇప్పుడు అందరిలో మెదళ్లలో మెదలుతున్న అంతుచిక్కని ప్రశ్న. ఉక్రెయిన్ మెరుపుదాడి వెనక ఎవరున్నారు.? ఈ ప్రశ్నలు తలెత్తుతున్ననేపథ్యంలో ఉక్రెయిన్ కు బ్రిటన్ ఇచ్చిన హామీ హాట్ టాపిక్ అయింది.
బుధవారం(జూన్4) ఉక్రెయిన్ కు బ్రిటన్ ప్రభుత్వం కీలక హామీ ఇచ్చింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో మొదటి నుంచి ఆర్మీ సపోర్టు చేస్తున్న బ్రిటన్ ఇప్పుడు ఆ మద్దతును మరింత పెంచింది. 2024లో ఉక్రెయిన్ కు 10వేల డ్రోన్లను సరఫరా చేసిన బ్రిటన్.. తాజాగా ఆ సంఖ్యను పదిరెట్లు పెంచింది. 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నాటికి మొత్తం లక్ష డ్రోన్లను సరఫరా చేసేందుకు హామీ ఇచ్చి ఉక్రెయిన్ కు సైనిక, ఆయుధ సపోర్టును మరింత పెంచింది.
రష్యా దురాక్రమణను ఎదర్కొనేందుకు టెక్నాలజీ పరంగా, సైన్యం పరంగా మరింత మద్దతు అవసరమని జర్మనీతో కలిసి బుధవారం నిర్వహించిన బ్రస్సెల్స్‌లో సమావేశంలో బ్రిటన్ ప్రకటించింది. 50 దేశాల ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్ సమావేశంలో రక్షణ కార్యదర్శి జాన్ హీలీ ఈప్రకటన చేశారు.
గతేడాది 10వేల డ్రోన్లను ఉక్రెయిన్ కు అందించిన యూకె.. ఈ ఏడాది ఆ సంఖ్యను పదిరెట్లు పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష డ్రోన్లను సరఫరా చేస్తామని బ్రిటన్ హామీ ఇచ్చింది. ఉక్రెయిన్ కు ఆయుధ, సైనిక శిక్షణ కోసం రికార్డు స్థాయిలో 473 మిలియన్ల డాలర్ల డ్రోన్ ప్యాకేజీని ప్రకటించిన యూకే..ఈ యేడాది లక్ష డ్రోన్లను అందించనుంది.
2026 ఆర్థిక సంవత్సరంలో లక్షలాది డ్రోన్‌లను పంపిణీ చేయడంతోపాటు కీలకమైన ఫిరంగి మందుగుండు సామగ్రి పంపిణీ చేయనున్నట్లు ప్రకటించి బ్రిటన్ ఉక్రెయిన్‌కు తన మద్దతును మరింత పెంచింది.
డ్రోన్ల డెలివరీతో పాటు 2025 జనవరి నుంచి ఉక్రెయిన్‌కు 1లక్షా40వేల ఫిరంగి గుండ్లు రవాణా చేశామని, 2026 ఆర్థిక సంవత్సరంలో ఉక్రెయిన్ దళాలకు శిక్షణ ఇవ్వడానికి మరో 247 మిలియన్ పౌండ్లను ఖర్చు చేస్తామని బ్రిటన్ తెలిపింది.
జూన్ 1న ఉక్రెయిన్ సక్సెస్ ఫుల్ గా స్పైడర్‌వెబ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత బ్రిటన్ నుంచి ఉక్రెయిన్ కు మరింత మద్దతు లభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఉక్రెయిన్ భద్రతా సేవ (SBU) 117 డ్రోన్లను రష్యన్ భూభాగంలోకి అక్రమంగా రవాణా చేసింది. నాలుగు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. 41 సైనిక విమానాలను నేలమట్టం చేసింది.
ఉక్రెయిన్‌లోని యుద్ధభూమి నుంచి మేం చాలా ప్రతిరోజు చాలా పాఠాలు నేర్చుకున్నాం.ఉక్రెయిన్ పౌరులను రక్షించడంలో సహాయపడేందుకు , జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు బ్రిటిష్ కంపెనీలు లేటెస్ట్ కొత్త డ్రోన్లను అభివృద్ధి చేసేందుకు భారీ ఎత్తున ఉక్రెయిన్ కు ఆర్మీ, ఆయుధ సాయం అందిస్తున్నామని బ్రిటన్ రక్షణ కార్యదర్శి హీలీ చెప్పారు.50 దేశాల ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్ సమావేశంలో బ్రిటన్ రక్షణ కార్యదర్శి హీలీ ఉక్రెయిన్‌కు బ్రిటన్ తాజా సైనిక మద్దతు చొరవను అధికారికంగా ప్రకటించారు.