Tension in OU: నిరసన తెల్పుతున్న విద్యార్థులు అరెస్ట్

Tension in OU: నిరసన తెల్పుతున్న విద్యార్థులు అరెస్ట్

హైదరాబాద్ లోని ఓయూలో విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నిరుద్యోగ మార్చ్, నిరసన దీక్ష నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేయగా.. నిరసన తెలుపుతున్న విద్యార్థులను సైతం పోలీసులు అరెస్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన తెలిపినందకు తనను అరెస్టు చేశారని ఓ విద్యా్ర్థి నాయకుడు ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 30లక్షల విద్యార్థుల కోసం తాను నిలబడతానని చెప్పారు. ఈ ధర్నాకు కొనసాగింపుగా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు తాను నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎవరూ ధైర్యం కోల్పోవద్దని, పోరాటం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.  

ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో అరెస్ట్ అయినా ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీ కోరారు. వారిలో రమేష్, సురేష్, షమీమ్ లను ఉండగా.. వారికి వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఇప్పటికే ఈ కేసులో 12 మంది అరెస్ట్ కాగా.. మార్చి 23న అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.